ఆదివారం 27 సెప్టెంబర్ 2020
Telangana - Aug 12, 2020 , 14:38:41

గ్రీన్‌చాలెంజ్‌ కార్యక్రమం అపూర్వమైనది: నటి లోరా అమ్ము

గ్రీన్‌చాలెంజ్‌ కార్యక్రమం అపూర్వమైనది: నటి లోరా అమ్ము

హైదరాబాద్‌: రాజ్యసభ సభ్యుడు సంతోష్‌కుమార్‌ నిర్వహిస్తున్న గ్రీన్‌ ఇండియా చాలెంజ్‌ కార్యక్రమం అపూర్వమైనదని నటి లోరా అమ్ము పేర్కొన్నారు. సినీనటి సునీత మనోహర్ ఇచ్చిన హరిత సవాల్‌ను స్వీకరించిన ఆమె బుధవారం సంజీవయ్యపార్క్‌లో మూడు మొక్కలు నాటారు.

ఈ సందర్భంగా లోరా అమ్ము మాట్లాడుతూ, గ్రీన్‌ చాలెంజ్‌ కార్యక్రమాన్ని ఒక ఐకానిక్ ప్రోగ్రాంగా దేశవ్యాప్తంగా మరింత ముందుకు తీసుకెళ్లాలని కోరారు. తనకు ఈ అవకాశాన్ని కల్పించిన ఎంపీ సంతోష్‌కుమార్‌కు ఆమె ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందని వెల్లడించారు. అనంతరం నటులు సంధ్య జానకి, స్వామి, ఎర్రచెందే పూర్ణగుప్తాకు గ్రీన్‌ చాలెంజ్‌ విసిరారు.  logo