ఆదివారం 25 అక్టోబర్ 2020
Telangana - Oct 02, 2020 , 11:10:37

మహాత్ముడికి నివాళులర్పించిన గవర్నర్‌, సీఎం కేసీఆర్‌

మహాత్ముడికి నివాళులర్పించిన గవర్నర్‌, సీఎం కేసీఆర్‌

హైదరాబాద్‌ : దేశవ్యాప్తంగా మహాత్మా గాంధీ 151వ జయంతి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. అందులో భాగంగా తెలంగాణ ప్రభుత్వం సైతం వేడుకలను ఘనంగా నిర్వహించింది. ఉదయం 10 గంటల 45 నిమిషాల సమయంలో లంగర్‌హౌస్‌లోని బాపూఘాట్‌ వద్ద మహత్ముడి విగ్రహానికి గవర్నర్‌ తమిళి సై సౌందర్‌ రాజన్‌, సీఎం కేసీఆర్‌ పూలమాల వేసి పుష్పగుచ్ఛాలు ఉంచి నివాళులర్పించారు. అనంతరం నిర్వహించిన సర్వమత ప్రార్థనల్లో వారు పాల్గొన్నారు. స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డి, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పలువురు ఉన్నతాధికారులు సైతం బాపూజీకి నివాళులర్పించారు.  


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.logo