సోమవారం 21 సెప్టెంబర్ 2020
Telangana - Aug 24, 2020 , 16:00:26

అట్టడుగు వర్గాల అభ్యున్నతే ప్రభుత్వ ధ్యేయం

అట్టడుగు వర్గాల అభ్యున్నతే ప్రభుత్వ ధ్యేయం

భద్రాద్రి కొత్తగూడెం : టీఆర్ఎస్ ప్రభుత్వం బలహీన వర్గాల అభ్యున్నతి కోసం నిరంతరం పాటుపడుతందని  ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే రేగా కాంతారావు తెలిపారు. జిల్లాలోని కరకగూడెం మండలం సమత్ బట్టుపల్లి లో నిర్మించిన 27 డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను లబ్ధిదారులకు ఆయన అందజేశారు. ఈ సందర్భంగా కాంతారావు మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ అన్ని వర్గాల ప్రయోజనాల కోసం సంక్షేమ పథకాలు ప్రవేశ పెడుతూ అభివృద్ధికి పాటుపడుతున్నారని వివరించారు.

నిరుపేదలకు మౌలిక వసతులు కల్పించడంతో పాటు వారి సంక్షేమానికి అవసరమైన కార్యక్రమాలను రూపొందించి ప్రభుత్వం అమలు చేస్తుందన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో ఎన్నడూ జరగని విధంగా అభివృద్ధి పరుగులు పెడుతుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.


logo