సోమవారం 10 ఆగస్టు 2020
Telangana - Jul 20, 2020 , 12:21:09

పేదలు ఆత్మగౌరవంతో బతకాలన్నదే ప్రభుత్వ లక్ష్యం : మంత్రి నిరంజన్ రెడ్డి

పేదలు ఆత్మగౌరవంతో బతకాలన్నదే ప్రభుత్వ లక్ష్యం : మంత్రి నిరంజన్ రెడ్డి

వనపర్తి : వనపర్తికి కొత్తగా 1500 డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు మంజూరు అయ్యాయని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. వనపర్తి పట్టణంలో డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను మంత్రి పరిశీలించి మాట్లాడారు. వనపర్తి పట్టణంలో ఇప్పటికే పెద్దగూడెం రోడ్, చిట్యాల, అప్పాయిపల్లి రోడ్లలో నిర్మాణంలో ఉన్న ఇండ్లకు అదనంగా ఇవి మంజూరైనట్లు మంత్రి తెలిపారు. పట్టణంలో 700, వనపర్తి నియోజకవర్గంలో 800 ఇండ్లు మంజూరయ్యాయని వెల్లడించారు. పారదర్శకంగా అర్హులైన పేదలకు ఇండ్లు కేటాయిస్తామన్నారు.

సంక్షేమం, అభివృద్ధి  తెలంగాణ ప్రభుత్వం మొదటి ప్రాధాన్యాలు అని పేర్కొన్నారు. దేశానికే ఆదర్శంగా తెలంగాణ ప్రభుత్వ పథకాలు ఉన్నాయని కొనియాడారు. కరోనా సంక్షోభంలోనూ సంక్షేమ పథకాలను కొనసాగిస్తున్న ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ కే దక్కుతుందన్నారు. పేదలు ఆత్మగౌరవంతో బతకాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని వివరించారు. అదనంగా ఇండ్లు మంజూరు చేసినందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ కు కృతజ్ఞతలు తెలిపారు.logo