బుధవారం 23 సెప్టెంబర్ 2020
Telangana - Aug 27, 2020 , 10:49:45

చారిత్రాత్మకమైన పాలకుర్తి ప్రాంత్ర అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉంది

చారిత్రాత్మకమైన పాలకుర్తి ప్రాంత్ర అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉంది

జనగాం : చారిత్రాత్మకమైన పాలకుర్తి ప్రాంత అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉందని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. సహజ కవి బమ్మెర పోతనామాత్యుడి జయంతి సందర్భంగా పోతనామాత్యుడికి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఈ రోజును భాగవత దినోత్సవంగా జరుపుకుంటారని చెప్పారు.

మహా భాగవతం రచించిన మహానుభావుడు పోతన అన్నారు. తెలుగు వారు గర్వించదగ్గ మహాకవి బమ్మెర  పోతన జన్మించిన గ్రామం బమ్మెర.. నా నియోజకవర్గంలో వుండటం నా అదృష్టంగా భావిస్తున్నాని తెలిపారు. అది కవి, తొలి తెలుగు విప్లవ కవి, ప్రజల భాషలో గ్రంథాలు రాసిన పాల్కురికి సోమనాథుడు, సహజ కవి, తన గ్రంథాలను రాజులకు అంకితం ఇవ్వడానికి ఒప్పుకోని ఆత్మ గౌరవ కవి బమ్మెర పోతనామాత్యుడు జన్మించిన పుణ్యభూమి అన్నారు. 

అంతేకాదు వాల్మీకి ఆశ్రమం, సీతా రాముల తనయులు లవకుశుల జన్మస్థానం వాల్మీకి పురం వల్మీడి, పాలకుర్తి, బమ్మెర గ్రామాలను సీఎం కేసీఆర్  టూరిజం హబ్ గా మార్చాలని నిర్ణయించినట్లు పేర్కొన్నారు. రూ.25కోట్ల నిధులు కూడా మంజూరు చేశారని వెల్లడించారు. సీఎం కేసీఆర్ ఆలోచనలతో ఈ ప్రాంతాన్ని టూరిజం హబ్ గా అభివృద్ధి చేస్తున్నామని మంత్రి తెలిపారు.logo