బుధవారం 01 ఏప్రిల్ 2020
Telangana - Mar 09, 2020 , 01:35:32

పరిశ్రమలకు మరింత ప్రోత్సాహం

పరిశ్రమలకు మరింత ప్రోత్సాహం
  • రాయితీలు, ప్రోత్సాహకాలకు రూ.1,500 కోట్లు
  • మొత్తం రూ.1,998 కోట్లు కేటాయింపు

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: పరిశ్రమలశాఖకు ప్రభుత్వం బడ్జెట్‌లో రూ.1998.19 కోట్లు కేటాయింపులు చేసింది. రూ.329.98 కోట్లు నిర్వహణ పద్దుకు, రూ.1,668.21 కోట్లు ప్రగతి పద్దులకు కేటాయించింది. ప్రగతి పద్దులో రూ.1,500 కోట్లు ప్రోత్సాహకాలను అందించనున్నది. పరిశ్రమలకు రాయితీలు, ప్రోత్సాహకాలకు గత ఏడాది రూ.75 కోట్లు ప్రకటించింది. ఆర్థికమాంద్యం నేపథ్యంలో పరిశ్రమల స్థాపన తగ్గితే ఉపాధి అవకాశాలపై ప్రభావం చూపే అవకాశం ఉన్నందున ప్రోత్సాహకాలను అందించాలని నిర్ణయించింది. ప్రగతి పద్దులో గనులశాఖకు రూ.76.29 కోట్లు, గ్రామీణ, చిన్న తరహా పరిశ్రమల ప్రోత్సాహించడానికి రూ.1,132 కోట్లు కేటాయించింది. గనులశాఖ ప్రగతి పద్దులకు రూ.52 కోట్లు, నాన్‌ ఫెర్రాయిస్‌ మైనింగ్‌, మెటలర్జికల్‌ ఇండస్ట్రీస్‌కు రూ.76.29 కోట్లు కేటాయించింది. పరిశ్రమలశాఖకు దాదాపు రూ.2వేల కోట్లు కేటాయించడం శుభపరిణామమని ఎఫ్‌టీసీసీఐ సీనియర్‌ ఉపాధ్యక్షుడు రమాకాంత్‌ ఇనాని అన్నారు. ఈ నిర్ణయంతో పరిశ్రమవర్గాలకు భారీ ఊరట లభించినట్టయిందని చెప్పారు. హైదరాబాద్‌ నగరాభివృద్ధికి రూ.10 కోట్లు ఖర్చుచేయడం పరిశ్రమలవర్గాలకు పరోక్షంగా ఉపయోగపడుతుందన్నారు. బడ్జెట్‌లో పరిశ్రమలకు పెద్దఎత్తున నిధులు కేటాయించినందుకు ప్రభుత్వానికి టీఐఎఫ్‌ అధ్యక్షుడు కే సుధీర్‌రెడ్డి ధన్యవాదాలు తెలిపారు. టీఎస్‌ఐపాస్‌ ద్వారా పురోగమన దశలో ఉన్న పారిశ్రామికరంగానికి ఈ కేటాయింపులు ఎంతో ఉత్సాహాన్ని ఇస్తాయని చెప్పారు. 
logo
>>>>>>