కుమ్రం భీం ఆసిఫాబాద్ : కాగజ్ నగర్ నూతన మార్కెట్ కమిటీ పాలకవర్గం ఈ రోజు కొలువుతీరింది. నూతన మార్కెట్ కమిటీ చైర్మన్గా కాగజ్ నగర్ పట్టణానికి చెందిన కాసం శ్రీనివాస్ చేత మార్కెట్ కమిటీ కార్యదర్శి కొవిడ్ నిబంధనలు పాటిస్తూ ప్రమాణ స్వీకారం చేయించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సిర్పూర్ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప హాజరయ్యారు.
నూతన పాలకవర్గంలో వైస్ చైర్మన్ గా డోకె రాజన్న డైరెక్టర్లుగా మౌల్కర్ లక్ష్మణ్, మహ్మద్ నజీర్, పిరిసింగుల పోచయ్య , నైతం సత్తయ్య, బి.రాణి రాయ్ సదాశివ్ ఓం బజాజ్ , తోట తిరుపతి ప్రమాణ స్వీకారం చేసారు. నూతన పాలకవర్గానికి ఎమ్మెల్యే కోనప్ప, జెడ్పీ వైస్ చైర్మన్ కోనేరు కృష్ణారావు, మున్సిపల్ చైర్మన్ సద్దాం హుస్సేన్ వైస్ చైర్మన్ గిరీష్, శుభాకాంక్షలు తెలిపారు.
ఇవి కూడా చదవండి..
హరితహారం మొక్కలకు నీళ్లు పట్టిన కలెక్టర్
ఘనంగా పెద్ద హనుమాన్ జయంతి ఉత్సవాలు
చిరు వ్యాపారుల కష్టాలకు ఇక చెల్లు చీటీ : మంత్రి హరీశ్ రావు
మావోయిస్టులు జన జీవన స్రవంతిలో కలవాలి
తప్పు ఒప్పుకున్న బెలారస్ జర్నలిస్టు..
సీసీ కెమెరాలను ప్రారంభించిన మంత్రి శ్రీనివాస్ గౌడ్
దోషులను కఠినంగా శిక్షిస్తాం : మంత్రి సత్యవతి