ఆదివారం 29 మార్చి 2020
Telangana - Mar 03, 2020 , 01:13:01

కండ్లల్లో కారంకొట్టి అరకిలో బంగారం చోరీ

కండ్లల్లో కారంకొట్టి అరకిలో బంగారం చోరీ

ఖమ్మంక్రైం: వ్యాపారి కండ్లల్లో కారం కొట్టి బంగారం, నగదుతో ఉడాయించిన ఘటన ఖమ్మంలో సోమవారం రాత్రి చోటుచేసుకున్నది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకా రం.. విజయవాడకు చెందిన బంగారం హోల్‌సేల్‌ వ్యాపారి శ్రీపాల్‌ బంగారం కొనుగోలు చేసేందుకు సోమవారం విజయవాడ నుంచి ఖమ్మం వచ్చాడు. కొనుగోళ్లు పూర్తయిన అనంతరం విజయవాడకు వెళ్లేందుకు రాత్రి 7.45 గంటలకు శాతవాహన రైలుకోసం గాంధీచౌక్‌ మధ్యగేట్‌ నుంచి నడుచుకుంటూ వెళ్తుండగా ఇద్దరు ఆగంతుకులు అతడి కండ్లల్లో కారంచల్లి గాయపరిచి.. అర్ధకిలో బంగారం, రూ.లక్షనగదు, సెల్‌ఫోన్‌, చేతిగడియారంతో ఉడాయించారు. అతడు స్పృహలోకి వచ్చాక త్రీటౌన్‌, జీఆర్పీ పోలీసులకు సమాచారమిచ్చారు. గాయాలతోఉన్న శ్రీపాల్‌ను చికిత్సనిమిత్తం ప్రభుత్వదవాఖానకు తరలించారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. 
logo