ఆదివారం 25 అక్టోబర్ 2020
Telangana - Oct 09, 2020 , 02:57:35

ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయమే లక్ష్యం

ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయమే లక్ష్యం

  • రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌

ఖమ్మం: కలిసికట్టుగా పనిచేసి పట్టభద్రుల శాసనమండలి ఎన్నికల్లో విజయం సాధిద్దామని రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ పిలుపునిచ్చారు. గురువారం రాత్రి ఖమ్మంలోని టీఆర్‌ఎస్‌ కార్యాలయంలో పార్టీ కార్పొరేటర్లు, నాయకులతో ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. గ్రాడ్యుయేట్ల ఓటు నమోదుపై దృష్టి సారించాలని చెప్పారు. స్వరాష్ట్రం ఏర్పడ్డాక ప్రతి విషయంలోనూ రాష్ట్రం ముందంజలో ఉన్నదని ఎమ్మెల్సీ, రైతు బంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్‌రెడ్డి చెప్పారు. ఆరేండ్లలోనే లక్షన్నర కొత్త ఉద్యోగాలు ఇచ్చామని పేర్కొన్నారు. మరోవైపు, ఖమ్మం జిల్లా కాంగ్రెస్‌ పార్టీ మైనార్టీ విభాగం అధ్యక్షుడు తాజుద్దీన్‌బాబాతోపాటు వందల కుటుంబాలు.. పువ్వాడ సమక్షంలో క్యాంపు కార్యాలయంలో టీఆర్‌ఎస్‌లో చేరాయి. 

సత్తా చాటుదాం: గెల్లు శ్రీనివాస్‌యాదవ్‌

వనపర్తి విద్యావిభాగం: టీఆర్‌ఎస్‌వీ కార్యకర్తలు, విద్యావంతులు, మేధావులు సమర్థంగా పనిచేసి ఎమ్మెల్సీ ఎన్నికల్లో సత్తా చాటుదామని టీఆర్‌ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్‌యాదవ్‌ పిలుపునిచ్చారు. పట్టభద్రులందరితో ఓటు నమోదుచేయించాలని సూచించారు. వనపర్తి జిల్లాకేంద్రంలో పట్టభద్రుల నియోజకవర్గ శాసనమండలి సన్నాహక సమావేశాన్ని టీఆర్‌ఎస్వీ ఆధ్వర్యంలో నిర్వహించారు. 


logo