మంగళవారం 29 సెప్టెంబర్ 2020
Telangana - Aug 12, 2020 , 19:55:58

ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దడమే లక్ష్యం : విప్ ఎమ్మెల్సీ కర్నె

ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దడమే లక్ష్యం : విప్ ఎమ్మెల్సీ కర్నె

యాదాద్రి భువనగిరి : గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసి ఆదర్శ గ్రామంగా తీర్చడమే తమ లక్ష్యమని ప్రభుత్వ విప్ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ అన్నారు. సంస్థాన్ నారాయణపూర్ మండల కేంద్రంలో నూతనంగా సీడీపీ నిధులతో నిర్మించిన గ్రామపంచాయతీ దుకాణాల సముదాయాన్ని బుధవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..గ్రామాల అభివృద్ధికి టీఆర్ఎస్ కృషి చేస్తుందన్నారు. గ్రామాల సమగ్రాభివృద్ధికి సీఎం కేసీఆర్ నిరంతరం పాటుపడుతున్నారని పేర్కొన్నారు. కార్యక్రమంలో  ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.


logo