గురువారం 04 జూన్ 2020
Telangana - May 13, 2020 , 00:47:37

ప్రతి ఎకరాకు నీరందించడమే లక్ష్యం

ప్రతి ఎకరాకు నీరందించడమే లక్ష్యం

  • ఎస్సీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌

ధర్మపురి: ప్రతి ఎకరాకు సాగు నీరందించి రాష్ర్టాన్ని కోటి ఎకరాల మాగాణిగా మార్చడమే లక్ష్యమని ఎస్సీ సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ పేర్కొన్నారు. జగిత్యాల జిల్లా ధర్మపురిలో మంగళవారం నియోజకవర్గంలోని ఆరు మండలాల అధికారులు, ప్రజాప్రతినిధులతో ఎస్సారెస్పీ పిల్ల కాలువల మరమ్మతు పనులపై వేర్వేరుగా సమీక్షించారు. ఉపాధి హామీ పథకం కింద కాలువల మరమ్మతు పనులు ఈ నెల 18 నుంచి 15 రోజులపాటు చేపట్టాలని, కాలువల్లో ఏర్పడ్డ బుంగలు, పూడిక, పెరిగిన పిచ్చి మొక్కలను తొలగించాలని సూచించారు.  


logo