మంగళవారం 11 ఆగస్టు 2020
Telangana - Jul 20, 2020 , 02:35:57

అభివృద్ధికి అడ్డుపడుతున్న ప్రతిపక్షాలు

అభివృద్ధికి అడ్డుపడుతున్న ప్రతిపక్షాలు

  • ప్రతి చిన్న విషయానికి కోర్టుకు వెళ్తూ రాద్ధాంతం
  • రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్‌రెడ్డి  

మహబూబాబాద్‌ రూరల్‌: వ్యవసాయ, సంక్షేమ పథకాల అమలులో దేశంలోనే తెలంగాణ ఆదర్శంగా నిలిచింది.. కానీ రాష్ట్రంలోని ప్రతిపక్ష పార్టీలు అభివృద్ధికి అడుగడుగునా అడ్డుపడుతున్నాయని రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్‌రెడ్డి మండిపడ్డారు. ప్రతి చిన్న విషయానికి కోర్టుకు వెళ్తూ రాద్ధాంతం చేస్తున్నాయని విమర్శించారు. ఆదివారం మహబూబాబాద్‌ మండలంలోని మల్యాలలో రైతు వేదిక భవన నిర్మాణానికి పల్లా శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశంలోని ఏ రాష్ట్రంలోనూ రైతుబంధు, రైతుబీమా, నిరంతర ఉచిత కరెంటు వంటి కార్యక్రమాలు అమలు చేయడంలేదన్నారు. ఒక్క తెలంగాణలో మాత్రమే రైతులకు రెండు పంటలకు సాగు నీరు, ఎకరాకు రూ.10వేల చొప్పున పెట్టుబడి సాయం అందిస్తున్నట్లు స్పష్టంచేశారు. ఇతర రాష్ర్టాల ప్రముఖులు తెలంగాణకు వచ్చి కేసీఆర్‌ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రశంసిస్తున్నారని చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్ట్‌తో సీఎం కేసీఆర్‌ చరిత్రలో నిలిచి ఉంటారని తెలిపారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే శంకర్‌నాయక్‌, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. logo