మంగళవారం 20 అక్టోబర్ 2020
Telangana - Oct 07, 2020 , 17:07:04

మిషన్‌ కాకతీయతో చెరువులకు పూర్వ వైభవం

మిషన్‌ కాకతీయతో చెరువులకు పూర్వ వైభవం

మేడ్చల్ మల్కాజిగిరి : తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత చెరువుల సుందరీకరణ, అభివృద్ధి పనులను చేపట్టి చెరువులకు పూర్వ వైభవాన్ని తీసుకు వచ్చిందని కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. కూకట్‌పల్లి డివిజన్‌ పరిధిలో రూ. 50 లక్షల వ్యయంతో చేపడుతున్న ఖాజా కుంట చెరువు అభివృద్ధి, సుందరీకరణ పనులను ఎమ్మెల్యే  బుధవారం ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఖాజా కుంట చెరువు సమీపంలోని కాలనీ వాసులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కాలనీ మధ్యలో ఉన్న ఖాజా కుంట చెరువును అభివృద్ధి చేస్తాం. అక్కడే పార్కును ఏర్పాటు చేసి అహ్లాదకరంగా తీర్చిదిద్దడానికి చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. 

తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మిషన్‌ కాకతీయ కార్యక్రమంలో భాగంగా చెరువులను అభివృద్ధి చేసి ప్రజలకు అహ్లాదకరమైన వాతావరణాన్ని అందించే విధంగా తీర్చిదిద్దుతుందని పేర్కొన్నారు. ఖాజా కుంట చెరువు అభివృద్ధి పనులను త్వరగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకు వస్తామన్నారు. కార్యక్రమంలో కార్పొరేటర్‌ జూపల్లి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.logo