మంగళవారం 02 మార్చి 2021
Telangana - Jan 17, 2021 , 01:52:13

మనీశ్‌కు తొలి వ్యాక్సిన్‌

మనీశ్‌కు తొలి వ్యాక్సిన్‌

దేశంలోనే తొలి కరోనా టీకా వేయించుకొన్న ఢిల్లీ ఎయిమ్స్‌ పారిశుద్ధ్య కార్మికుడు

న్యూఢిల్లీ: దేశంలో మొదటి కరోనా టీకాను ఢిల్లీలోని ఎయిమ్స్‌ దవాఖానలో శనివారం ఉదయం 10.30 గంటలకు వేశారు. అక్కడ పనిచేస్తున్న మనీశ్‌కుమార్‌ అనే పారిశుద్ధ్య కార్మికుడు దేశంలో మొదటి కరోనా టీకా వేయించుకొన్న వ్యక్తిగా రికార్డు సృష్టించాడు.టీకా వేసుకునేందుకు సహచరులు భయపడుతుండటంతో వారిలో భయాన్ని పోగొట్టేందుకు తానే మొదట టీకా వేసుకున్నట్టు 34 ఏండ్ల మనీశ్‌ తెలిపారు. మనీశ్‌కు భారత్‌ బయోటెక్‌ అభివృద్ధి చేసిన కొవాగ్జిన్‌ టీకా వేశారు. మొదటి రోజు పలువురు ప్రముఖులు కూడా టీకాలు వేయించుకొన్నారు. ఢిల్లీ ఎయిమ్స్‌ డైరెక్టర్‌ రణ్‌దీప్‌ గులేరియా, నీతి ఆయోగ్‌ సభ్యుడు వీకే పాల్‌, బీజేపీ ఎంపీ మహేశ్‌ శర్మ, పశ్చిమబెంగాల్‌ రాష్ట్ర మంత్రి నిర్మల్‌ మాజి, కొవిషీల్డ్‌ టీకాను తయారుచేస్తున్న సీరం ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా సీఈవో అదర్‌ పూనావాలా తదితరులు కరోనా టీకాలు వేయించుకొన్నారు.

VIDEOS

తాజావార్తలు


logo