ఆదివారం 09 ఆగస్టు 2020
Telangana - Jul 29, 2020 , 19:47:03

ఎర్రుపాలెం మండలంలో తొలి కరోనా మృతి

 ఎర్రుపాలెం మండలంలో తొలి కరోనా మృతి

ఖమ్మం : ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలం లో తొలి కరోనా మృతి బుధవారం నమోదు అయ్యింది. బనిగండ్లపాడు ప్రాథమిక వైద్యాధికారి రాజు తెలిపిన వివరాల ప్రకారం మీనవోలు గ్రామానికి చెందిన షేక్ బికారి సాహెబ్(72) ఖమ్మం లో ప్రభుత్వ ఆస్పత్రిలో మంగళవారం అడ్మిట్ అయ్యాడు. అప్పటికే  కరోనా లక్షణాలు ఉన్న బికారి సాహెబ్ పరిస్థితి విషమించడంతో మంగళవారం రాత్రి మృతి చెందినట్లు వైద్య శాఖ అధికారులు తెలిపారు. ఎర్రుపాలెం మండలంలో తొలి కరోనా మరణం నమోదు కావడంతో మీనవోలు గ్రామ పరిసర ప్రాంతాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు. దీంతో మృతుని కుటుంబ సభ్యులకు హోమ్ క్వారంటైన్ లో ఉండాలని బనిగండ్లపాడు ప్రాథమిక వైద్యాధికారి రాజు సూచించారు.


logo