మంగళవారం 20 అక్టోబర్ 2020
Telangana - Sep 24, 2020 , 02:38:33

కొడుకును చంపిన తండ్రి

కొడుకును చంపిన తండ్రి

నాగారం: కుటుంబ కలహాలతో ఓ తండ్రి కన్న కొడుకును హత్య చేశాడు. ఈ ఘటన సూర్యాపేట జిల్లా నాగారం మండలం పస్తాల గ్రామంలో మంగళవారం రాత్రి చోటుచేసుకున్నది. పోలీసుల కథనం ప్రకారం.. పస్తాల గ్రామానికి చెందిన బండగొర్ల ఈదప్పకు కుమార్తె, ఇద్దరు కుమారులు ఉన్నారు. చిన్న కుమారుడు శ్రీశైలం(40), తండ్రి ఈదప్ప తర చూ గొడవపడుతుంటారు. మంగళవారం రాత్రి 9.30 గంటల ప్రాంతంలో గ్రామంలోని ఓ కిరాణ షాపు వద్ద ఈదప్ప కూర్చొ ని ఉండగా కొడుకు శ్రీశైలం అక్కడికి వచ్చా డు. వారిద్దరి మధ్య మాటామాటా పెరిగి గొడవకు దారితీసింది. ఈ క్రమంలో తండ్రి అక్కడ ఉన్న కర్రతో కొడుకు తలపై కొట్టడంతో తీవ్ర రక్తస్రావమై పడిపోయాడు. వెంటనే తండ్రి స్థానిక ఆర్‌ఎంపీ వద్దకు తీసుకెళ్లగా మృతిచెందాడు. దీంతో ఈదప్ప అక్కడి నుంచి పరారయ్యాడు. 


logo