బుధవారం 20 జనవరి 2021
Telangana - Jan 03, 2021 , 15:32:22

కొడుకుకు ఉద్యోగం రావాలని తండ్రి ఆత్మహత్య

కొడుకుకు ఉద్యోగం రావాలని తండ్రి ఆత్మహత్య

పెద్దపల్లి : వారసత్వ ఉద్యోగాల కోసం కన్నతండ్రులనే కడతేరుస్తున్న నేటి రోజుల్లో..కొడుకు ఉన్నతి కోసం ఓ తండ్రి తనువు చాలించిన విషాద సంఘటన జిల్లాలో చోటు చేసుకుంది. సింగరేణి అర్జీ2 పరిధిలోని ఓసీపీ-1 లో ఈపీ ఆపరేటర్‌గా పని చేస్తున్న పైడి మల్లేశం కొడుకుకి సింగరేణి ఉద్యోగం రావడం కోసం ఆదివారం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. మల్లేశానికి ఇద్దరు కుమారులు, ఒక కూతురు ఉన్నారు.

పెద్ద కుమారుడు ఆస్ట్రేలియాలో ఉద్యోగం చేస్తుండగా మెడికల్ అన్‌ఫిట్‌ ద్వారా చిన్న కుమారుడికి తన సింగరేణి ఉద్యోగాన్ని పెట్టించాలి అనుకొని దరఖాస్తు చేసుకున్నాడు. కాగా అధికారులు దరఖాస్తును పరిశీలించి ఫిట్‌గా ఉన్నాడని సర్టిఫికెట్‌ ఇచ్చారు. దీంతో డ్యూటీకి వెళ్లి వచ్చిన తెల్లవారి ఇంట్లో ఉరివేసుకుని చని పోయాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి..

కొడుకుకు ఉద్యోగం రావాలని తండ్రి ఆత్మహత్య


logo