మంగళవారం 14 జూలై 2020
Telangana - Jun 09, 2020 , 14:47:23

రైతు వేదిక భవన నిర్మాణ పనులు తక్షణమే చేపట్టాలి

 రైతు వేదిక భవన నిర్మాణ పనులు తక్షణమే చేపట్టాలి

ఖమ్మం : రైతు వేదిక భవన నిర్మాణ పనులు తక్షణమే చేపట్టాలని అధికారులకు రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అదేశించారు. జిల్లాలోని రఘునాధపాలెం మండల కేంద్రం లో నిర్మించే రైతు వేదిక భవన నిర్మాణ పనులను మంత్రి పరిశీలించి త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. మంత్రి అజయ్ కుమార్ సొంత ఖర్చులతో జింకలతండా క్రాస్ రోడ్డులో నిర్మించే రైతు వేదిక భవనం స్థలాన్ని సైతం పరిశీలించారు. ఈ నెల 2వ తేదీన ఇక్కడ నిర్మించే రైతు వేదిక భవన నిర్మాణానికి మంత్రి శంకుస్థాపన చేసిన విషయం తెలిసిందే. అలాగే పలు అభివృద్ధి పనులపై వ్యవసాయ, రెవెన్యూ అధికారులకు ఆయన పలు సూచనలు చేశారు. రైతు వేదిక భవనం జిల్లాకే ఆదర్శం కావాలన్నారు.


logo