ఆదివారం 05 జూలై 2020
Telangana - Jun 02, 2020 , 14:22:56

రైతు వేదిక నిర్మాణానికి రూ. 40 లక్షల విరాళం

రైతు వేదిక నిర్మాణానికి రూ. 40 లక్షల విరాళం

మెదక్ : రైతుల సంక్షేమం కోసం సీఎం కేసీఆర్‌ రాష్ట్ర వ్యాప్తంగా రైతు వేదికల నిర్మాణానికి సంకల్పించారు. ఈ బృహత్తరమైన కార్యక్రమానికి దాతల నుంచి విశేష స్పందన లభిస్తున్నది. ప్రభుత్వ కృషికి తోడు తమ వంతు సహకారం అందించేందుకు దాతలు ముందుకొస్తున్నారు. జిల్లాలోని రామాయంపేటలో రైతు వేదిక భవన నిర్మాణానికి మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి శంకుస్థాపన చేశారు. కాగా, ఈ భవన నిర్మాణానికి అయ్యే ఖర్చును మంత్రి కేటీఆర్ భార్య శైలిమ తాత గారైన దివంగత నూలి హనుమంతరావు పేరిట వారి కుటుంబీకులు ఆర్థిక సహాయం చేయనున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. సుమారు రూ.40 లక్షల వ్యయంతో నిర్మించే ఈ భవనాన్నినెల రోజుల్లో పూర్తి చేస్తామని,  ప్రారంభోత్సవానికి మంత్రి కేటీఆర్ రానున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు.


logo