శనివారం 06 జూన్ 2020
Telangana - May 14, 2020 , 01:16:50

పంట సొమ్ము 4 వేల కోట్లు జమ

పంట సొమ్ము 4 వేల కోట్లు జమ

  • సేకరించిన ధాన్యం తక్షణమే మిల్లులకు తరలింపు: పౌరసరఫరాల సంస్థ చైర్మన్‌ మారెడ్డి శ్రీనివాస్‌రెడ్డి

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: యాసంగి పంట కొనుగోలు కేంద్రాల్లో రైతుల నుంచి సేకరించిన ధాన్యాన్ని తక్షణమే మిల్లులకు  తరలించాలని పౌరసరఫరాల సంస్థ చైర్మన్‌ మారెడ్డి శ్రీనివాస్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. అకాల వర్షాలు కురుస్తుండటంతో కొనుగోలు కేంద్రాల్లో నిల్వలు పేరుకుపోకుండా చూడాలని సూచించారు. యాసంగిలో ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి రూ.4,006 కోట్లు రైతుల ఖాతాల్లో జమచేసినట్టు బుధవారం ఆయన వెల్లడించారు. మంగళవారం ఒక్కరోజే రూ.290 కోట్లు విడుదల చేసినట్టు వివరించారు. ఇప్పటివరకు 7.10 లక్షల మంది రైతుల నుంచి రూ.7,404 కోట్ల విలువైన ధాన్యాన్ని కొనుగోలు చేశామని చెప్పారు. 38.44 లక్షల టన్నుల ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల నుంచి రైసుమిల్లులకు తరలించినట్టు తెలిపారు. లాక్‌డౌన్‌ నేపథ్యంలో 83 శాతం రేషన్‌ లబ్ధిదారులకు రెండోవిడుత ఉచిత బియ్యం అందించామన్నారు. 87.55 లక్షల కుటుంబాలకు బుధవారంనాటికి 2.72 లక్షల టన్నుల బి య్యం, 2,488 టన్నుల కందిపప్పును పంపిణీ చేసినట్టు తెలిపారు. బుధవారంనాటికి 46,90,820 టన్నుల వ్యవసాయోత్పత్తులను ప్రభుత్వం కొనుగోలు చేసింది. వరిధాన్యం 41,33,678 టన్నులు కొన్నదని రైతుబంధుసమితి కంట్రోల్‌ రూం తెలిపింది.

కొనుగోలు చేసిన పంటల వివరాలు (టన్నుల్లో..)

పంటలు
కేంద్రాలు
బుధవారం
మొత్తం
వరి ధాన్యం
6,330
1,36,579
41,33,678
మక్కజొన్నలు
1,096
18,604
4,71,044 
శనగలు
88503
78,835
పొద్దుతిరుగుడు
14646,422
జొన్నలు
23301841
మొత్తం
7,551
1,56,051
46,90,820


       logo