గురువారం 02 ఏప్రిల్ 2020
Telangana - Mar 19, 2020 , 13:53:59

కరోనా అలర్ట్‌ : ఆఫీసులు, పబ్లిక్‌ ప్రదేశాల్లో ఇలా చేయొద్దు

కరోనా అలర్ట్‌ : ఆఫీసులు, పబ్లిక్‌ ప్రదేశాల్లో ఇలా చేయొద్దు

హైదరాబాద్‌ : కరోనా వైరస్‌ వ్యాప్తి నివారణకు సామాజిక దూరం పాటించాల్సిందిగా వైద్యఆరోగ్యశాఖ పేర్కొంది. ఒకరికొకరు వ్యక్తిగత దూరాలు పాటించాల్సిందిగా పౌరులకు సూచనలు చేసింది. ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా సామూహికంగా కలిసే ప్రతి కార్యక్రమాన్ని రద్దు చేసింది. పార్కులు, సమావేశాలు, ఫంక్షన్లు, సినిమాహాళ్లు, మాల్స్‌, విద్యాసంస్థలు, విమాన ప్రయాణాలపై ప్రభుత్వాలు నిషేధం విధించిన విషయం తెలిసిందే. సామాజిక దూరం ఎందుకు పాటించాలంటే ఎవరైనా ఓ వ్యక్తి వైరస్‌ భారిన పడితే ఆ వ్యక్తి నుంచి సగటున మరో ముగ్గురికి ఆ వైరస్‌ సోకుతుంది. కావునా ఒకరికొకరు దూరం పాటించడం ద్వారానే ముఖ్యంగా ఈ వైరస్‌ను అడ్డుకోవచ్చని వైద్యులు తెలుపుతున్నారు. ఈ నేపథ్యంలో వైరస్‌ వ్యాప్తి నివారణకు వైద్యఆరోగ్య నిపుణులు పౌరులకు పలు సూచనలు చేశారు. ప్రతిఒక్కరూ వీటిని పాటించడం ద్వారా వ్యాధి భారిన పడకుండా వైరస్‌ వ్యాప్తిని నిలువరించవచ్చని పేర్కొంటున్నారు. 

- బహిరంగ ప్రదేశాల్లో వ్యక్తికి వ్యక్తికి మధ్య ఆరు అడుగుల దూరం పాటించడం 

- జిమ్‌కు వెళ్లే అలవాటు ఉన్నవారు రన్నింగ్‌కు వెళ్లడం

- లిఫ్ట్‌లో ప్రయాణించేవారు ఎదురెదురుగా కాకుండా, శరీరాలు తగలకుండా ప్రయాణించడం

- ఎస్కలేటర్‌పై ప్రయాణించేవారు పట్టుకోసం సైడ్‌వాల్‌పై చేతులు పెట్టకుండా ఉండటం

- నోరు, ముక్కు కవర్‌ అయ్యేలా మాస్కులు ధరించడం

- ఏవైనా డోర్‌లను తెరిచేప్పుడు చేతులతో కాకుండా భుజాలతో తెరవడం

- చేతి వేళ్లను ఉపయోగించాల్సిన చోట మోచేయిని వినియోగించడం. ఇలా పలు జాగ్రత్తలను తీసుకుంటూ వైరస్‌ భారిన పడకుండా, వ్యాప్తి చెందకుండా చూసుకోవడం చేయొచ్చన్నారు.

logo