సోమవారం 13 జూలై 2020
Telangana - Jun 05, 2020 , 02:22:30

నేటినుంచి దవాఖానల్లో వైద్యసిబ్బంది విభజన

నేటినుంచి దవాఖానల్లో వైద్యసిబ్బంది విభజన

హైదరాబాద్‌ : రాష్ట్రంలో రెండురోజులుగా హైదరాబాద్‌, వరంగల్‌ తదితర ప్రాంతాల్లో వైద్యులు, సిబ్బందికి వైరస్‌ పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ఈ నేపథ్యంలో సర్కారు దవాఖానల్లో వైద్యులు, నర్సులు, ఇతర సిబ్బందిని విభజించి శుక్రవారం నుంచి వారం విడిచి వారం విధులు నిర్వహించేలా వైద్యశాఖ ప్రణాళికలు రూపొందించింది. దీని ప్రకారం ఒక వారం విధులు నిర్వహిస్తే మరో వారంపాటు వైద్యులు, సిబ్బంది ఇండ్లల్లోనే(క్వారంటైన్‌లో) ఉండాలి. ఆయా దవాఖానల్లోని వైద్యులు, సిబ్బందిని విభజించి విధుల చార్ట్‌ రూపొందించి అమలుచేయాలని బోధన, జిల్లాస్థాయి, ఏరియా దవాఖానల సూపరింటెండెంట్లకు వైద్యాధికారులు ఆదేశాలు జారీచేశారు. కాగా, దవాఖానల్లో ఓపీ సేవల ప్రారంభానికి ముందు వైద్యులు, సిబ్బందికి అవసరమైన పీపీఈ కిట్లు, ఎన్‌-95 మాస్కులు లక్షల్లో అందుబాటులో ఉంచామని టీవీవీపీ కమిషనర్‌ రమేశ్‌రెడ్డి తెలిపారు.logo