గురువారం 09 జూలై 2020
Telangana - Jun 19, 2020 , 13:45:32

అభివృద్ధిలో జిల్లాను ముందు వరుసలో ఉంచుతా : మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌

అభివృద్ధిలో జిల్లాను ముందు వరుసలో ఉంచుతా : మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌

మహబూబ్‌నగర్‌ : అభివృద్ధిలో జిల్లాను ముందు వరుసలో ఉంచుతానని ఎక్సైజ్‌ శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ అన్నారు. మహబూబ్‌నగర్‌ మున్సిపాలిటీలోని 22వ వార్డు మధుర నగర్‌లో శుక్రవారం ఆయన రూ.15లక్షల నిధులతో డ్రైనేజీ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లాలో అన్ని వసతులు కల్పిస్తానని, సీఎం కేసీఆర్‌ పాలనలో రాష్ట్రం అభివృద్ధిలో పరుగులు పెడుతోందన్నారు. ఇతర రాష్ట్రాలు సైతం అభివృద్ధిలో తెలంగాణను రోల్‌మోడల్‌గా తీసుకుంటుందన్నారు. ప్రభుత్వం నుంచి మరిన్ని నిధులు తెచ్చి జిల్లాను అన్ని విధాలా అభివృద్ధి చేస్తానన్నారు. ప్రస్తుతం కరోనా మహమ్మారి విజృంభిస్తుండడంతో ప్రజలంతా ప్రభుత్వ నిబంధనలు పాటిస్తూ జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఆయన వెంట స్థానిక అధికారులు, ప్రజాప్రతినిధులు, నాయకులున్నారు. 


logo