శుక్రవారం 05 జూన్ 2020
Telangana - Feb 06, 2020 , 01:25:26

ఒకే కుటుంబానికి చెందిన నలుగురు చిన్నారుల అదృశ్యం

ఒకే కుటుంబానికి చెందిన నలుగురు చిన్నారుల అదృశ్యం
  • మెదక్‌ జిల్లా తూప్రాన్‌లో ఘటన

తూప్రాన్‌ రూరల్‌: మెదక్‌ జిల్లా తూప్రాన్‌లో నివాసం ఉంటు న్న ఒకే కుటుంబానికి చెందిన నలుగురు చిన్నారులు బుధవారం అదృశ్యమయ్యారు. తూప్రాన్‌ ఎస్సై సుభాష్‌ తెలిపిన వివరాల ప్రకారం.. రాజస్థాన్‌లోని జోథ్‌పూర్‌కు చెందిన నస్రీన్‌ బాను తన భర్త జకీర్‌తో నెల రోజుల క్రితం గొడవపడింది. ఈ క్రమంలో తన పిల్లలు షాకీర్‌(10), సబేరా(8), నజరీన్‌(6), సమీర్‌(4)లను తీసుకొని మెదక్‌ జిల్లా తూప్రాన్‌లో ఉంటున్న అక్క పర్వీన్‌ ఇంటికి వచ్చి ఇక్కడే ఉంటున్నది. నాచారంలోని సీడ్స్‌ కంపెనీలో కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నది. బుధవారం ఉదయం 8గంటల ప్రాంతంలో నస్రీన్‌ డ్యూటీకి వెళ్లింది. అదే సమయంలో తన అక్కాబావ మెదక్‌ వెళ్లి మధ్యాహ్నం రెండు గంటల ప్రాంతంలో తిరిగొచ్చారు. డ్యూటీ ముగించుకొని సాయంత్రం ఇంటికి చేరుకున్న నస్రీన్‌ తన పిల్లలెక్కడ అంటూ అక్కాబావలను ప్రశ్నించింది. ఆడుకుంటామని చెప్పి వెళ్లారని వారు సమాధానమిచ్చారు. ఇరుగుపొరుగు వారిని ప్రశ్నించగా ఆచూకీ తెలియకపోవడంతో రాత్రి తూప్రాన్‌ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై తెలిపారు.


logo