మంగళవారం 14 జూలై 2020
Telangana - Jun 14, 2020 , 14:40:54

అభివృద్ధిలో దూసుకెళ్లాలి..అవార్డులతో మెరవాలి

అభివృద్ధిలో దూసుకెళ్లాలి..అవార్డులతో మెరవాలి

సిద్దిపేట: గతేడాది జాతీయ స్థాయిలో అవార్డు పొందినట్లుగానే..ఈ యేడాది కూడా సిద్దిపేట అర్బన్ మండలం మొదటి స్థానంలో నిలిపి జాతీయస్థాయి అవార్డు పొందేలా అభివృద్ధి పరుగులు పెట్టాలని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. సిద్దిపేట అర్బన్ మండలంలో గ్రామాల వారీగా అభివృద్ధి పనుల పురోగతిపై ప్రజాప్రతినిధులు, అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించి మంత్రి మాట్లాడారు. మండలం మళ్లీ జాతీయస్థాయి అవార్డు పొందేలా ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో సమిష్టిగా విధులు నిర్వర్తిస్తే సత్ఫలితాలు వస్తాయని చెప్పారు. 

గ్రామ ప్రగతి, పనుల పురోగతిపై ఎంపీపీ, జెడ్పీటీసీ, సర్పంచ్ లు, ఎంపీటీసీలు వివిధ శాఖల అధికారులతో హైదరాబాద్ లోని తన నివాసం నుంచి మంత్రి టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. పొన్నాలలో నిర్మాణం అవుతున్న పశువుల హాస్టల్ రాష్ట్రంలోనే మొదటిది కావడంతో రాష్ట్రం, ఇతర రాష్ట్రాల నుంచి మన వద్దకు వచ్చి విజిట్ చేస్తుంటారన్నారు. కావున పక్కా ప్రణాళికతో నిర్మాణం పూర్తయ్యే వరకు జెడ్పీటీసీ, సర్పంచ్ దగ్గరుండి పర్యవేక్షణ చేయాలని మంత్రి సూచించారు.


logo