బుధవారం 05 ఆగస్టు 2020
Telangana - Jul 10, 2020 , 01:30:24

మూడోరోజూ కొనసాగినకూల్చివేత

మూడోరోజూ కొనసాగినకూల్చివేత

  • ఫొటోలు తీసేందుకు ప్రయత్నించిన పోలీసులపై వేటు

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: పాత సచివాలయం భవనాల కూల్చివేత పనులు మూడోరోజు కొనసాగాయి. ఇప్పటివరకు హెచ్‌ సౌత్‌బ్లాక్‌ను పూర్తిగా, నార్త్‌బ్లాక్‌ను సగంవరకు కూల్చివేసినట్టు తెలిసింది. జీ(సర్వహిత), సీ (సమత) బ్లాక్‌లను పూర్తిగా, డీ బ్లాక్‌ను సగం వరకు కూల్చినట్టు సమాచారం. సీఎస్‌ సోమేశ్‌కుమార్‌, డీజీపీ మహేందర్‌రెడ్డి పనులను పర్యవేక్షిస్తున్నారు. సీసీటీవీ కెమెరాల నిఘాలో కూల్చివేత కొనసాగుతున్నది. కూల్చివేత పనులను ఫొటో తీస్తున్న ఇద్దరు పోలీసులను డీజీపీ ఆఫీస్‌కు అటాచ్‌ చేశారు.  


logo