రాష్ర్టానికి 7.5 లక్షల డోసులు

- రెండురోజుల్లో రాక.. ముందుగా వైద్య సిబ్బందికి
- నేడు కేంద్ర, రాష్ర్టాల ఆరోగ్యమంత్రుల సమావేశం
- వ్యాక్సిన్ పంపిణీ తేదీ ఖరారయ్యే అవకాశం
హైదరాబాద్, జనవరి 6 (నమస్తే తెలంగాణ): రెండురోజుల్లో రాష్ర్టానికి 7.5 లక్షల కరోనా టీకా డోసులు రానున్నాయి. ఆక్స్ఫర్డ్-ఆస్ట్రాజెనెకా తయారుచేసిన కొవిషీల్డ్ వ్యాక్సిన్ వస్తున్నట్టు సమాచారం. వీటిని ముందుగా వైద్యారోగ్యశాఖ సిబ్బందికి వేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 3 లక్షల మంది వైద్యసిబ్బంది ఉన్నారు. వ్యాక్సినేషన్ తేదీ ఖరారు కాగానే వీరందరికీ టీకాలు వేస్తారు. వ్యాక్సిన్ సామర్థ్యంపై స్పష్టత రాకపోవండంతో ఇన్నాళ్లూ కొందరు ప్రైవేట్ వైద్యసిబ్బంది టీకా వేసుకొనేందుకు జంకారు. తాజాగా డీసీజీఐ అనుమతులు రావడంతో వారు కొవిన్ సాఫ్ట్‌వేర్‌లో తమ పేర్లను నమోదు చేసుకొనేందుకు ముందుకొస్తున్నట్టు తెలుస్తున్నది. ఇంకా ఎవరికైనా అనుమానాలు ఉంటే నివృత్తి చేసేందుకు వైద్యారోగ్యశాఖ కార్యాచరణ రూపొందించింది. వీరందరికీ తర్వాతి దశలో టీకా వేయనున్నారు.
డ్రైరన్ ఒక్కరోజే..
టీకా పంపిణీలో ఎదురయ్యే సవాళ్లను తెలుసుకొనేందుకు రాష్ట్రవ్యాప్తంగా గురు, శుక్రవారాల్లో డ్రైరన్ నిర్వహించాలని అధికారులు నిర్ణయించారు. ఏర్పాట్లు పూర్తిచేశారు. కేంద్ర ప్రభుత్వ సూచనల మేరకు డ్రైరన్‌ను ఒక్కరోజుకే పరిమితంచేశారు. శుక్రవారం డ్రైరన్ ఉండనున్నది. రాష్ట్రవ్యాప్తంగా 1,200 కేంద్రాల్లో డ్రైరన్ జరుగనున్నది. మరోవైపు కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి గురువారం అన్ని రాష్ర్టాల వైద్యారోగ్యశాఖ మంత్రులతో ఆన్లైన్ సమావేశం నిర్వహించనున్నారు. సమావేశంలో వ్యాక్సినేషన్ ప్రారంభించే తేదీపై స్పష్టత వచ్చే అవకాశం ఉన్నది. సాధారణ ప్రజలకు టీకాలను ఎలా పంపిణీ చేయాలో చర్చించనున్నారు. ఇప్పటికే దేశవ్యాప్తంగా అన్ని రాష్ర్టాల్లో డ్రైరన్ జరిగింది. హైదరాబాద్, మహబూబ్‌నగర్ జిల్లాల్లో డ్రైరన్ నిర్వహించారు. ఈ నివేదికలు ఇప్పటికే కేంద్రానికి చేరాయి. సమావేశంలో భాగంగా టీకా పంపిణీలో ఎదురైన సవాళ్లు, సమస్యలపై సమీక్షించనున్నారు. వాటిని ఎలా అధిగమించాలో చర్చించి, తుది కార్యాచరణ రూపొందించే అవకాశం ఉన్నది.
తాజావార్తలు
- రామ మందిరానికి వజ్రాల వ్యాపారుల రూ.17 కోట్ల విరాళాలు
- ఆఫ్ఘన్లో కారుబాంబు పేలుడు:35 మంది మృతి
- ఇండోనేషియాలో భూకంపం, 42 మంది మృతి
- ..ఆ రెండు రాష్ట్రాల్లో ఒంటరిగానే పోటీ చేస్తాం : మాయావతి
- సంక్రాంతి స్పెషల్.. పవన్ కళ్యాణ్ ఇంట్లో రామ్ చరణ్..
- ‘వకీల్ సాబ్’ బడ్జెట్ శాటిలైట్ రైట్స్‌తోనే వచ్చేసిందా..?
- మీరెవరికి మద్దతిస్తున్నారు: మీడియాపై నితీశ్ చిందులు
- ఆత్మహత్య చేసుకుందామనుకున్నా..క్రాక్ నటుడి మనోగతం
- కుక్కపై లైంగిక దాడి.. ఓ వ్యక్తి అరెస్ట్
- మోదీ పాలనలో సుప్రీంకోర్టుపై నమ్మకం పోయింది: కె. నారాయణ