ఆదివారం 20 సెప్టెంబర్ 2020
Telangana - Sep 11, 2020 , 20:36:02

సీఎం కేసీఆర్ నిర్ణ‌యం హ‌ర్ష‌ణీయం : మ‌ంత్రి స‌త్య‌వ‌తి రాథోడ్‌

సీఎం కేసీఆర్ నిర్ణ‌యం హ‌ర్ష‌ణీయం : మ‌ంత్రి స‌త్య‌వ‌తి రాథోడ్‌

హైద‌రాబాద్ : ముఖ్యమంత్రి కేసీఆర్ రూపొందించి, అసెంబ్లిలో ప్రవేశ పెట్టిన నూతన రెవెన్యూ చట్టం నేడు ఆమోదం పొందడంపై రాష్ట్ర గిరిజన స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ శుక్ర‌వారం హ‌ర్షం వ్య‌క్తం చేశారు. ఈ చట్టం నేడు ఆమోదం పొందడంతో తెలంగాణ రాష్ట్ర సమితి భవన్‌లో నిర్వ‌హించిన మీడియా సమావేశంలో ఆమె మంత్రులు కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్, శ్రీనివాస్ గౌడ్, అజయ్ కుమార్‌తో క‌లిసి ఆమె మాట్లాడారు. ఈ రోజు చాలా సుదిన‌మ‌ని, తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఎదుర్కొంటున్న భూ సమస్యలకు పరిష్కారంగా ఈ చట్టం రావడం పట్ల ప్రజలకు ఆమె శుభాకాంక్ష‌లు తెలిపారు. రైతులు, గిరిజనుల, దళితుల పక్షాన ఆమె సీఎం కేసీఆర్‌కు ధ‌న్య‌వాదాలు తెలిపారు. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo