బుధవారం 23 సెప్టెంబర్ 2020
Telangana - Sep 07, 2020 , 11:36:36

టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు కొలిపాక రాములు మృతి బాధాకరం

టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు కొలిపాక రాములు మృతి బాధాకరం

హైదరాబాద్ : హుజురాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం కమలాపూర్ మండలం వంగపల్లి గ్రామానికి చెందిన టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు కొలిపాక రాములు అకాల మృతి పార్టీకి తీరని నష్టమని, రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ అన్నారు. టీఆర్ఎస్ ఆవిర్భావం నుంచి పార్టీ కోసం రాములు నిస్వార్థంగా పని చేసిన వ్యక్తి అని ఆయన అన్నారు. రజకుల సంక్షేమం కోసం రాములు ఎంతో కృషి చేశారని పేర్కొన్నారు. రాములు మృతి చెందడం పట్ల వినోద్ కుమార్ సంతాపం వ్యక్తం చేశారు. రాములు కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు.


logo