బుధవారం 27 మే 2020
Telangana - May 11, 2020 , 12:07:35

తాటి చెట్టుపై గీత కార్మికుడి మృతి

తాటి చెట్టుపై గీత కార్మికుడి మృతి

నల్లగొండ : రోజువారీగా కల్లు గీసేందుకు వెళ్లిన ఆ వక్తికి అదే  చివరి రోజు అవుతుందని ఊహించలేదు. ఎప్పటిలాగే తాటి చెట్టు ఎక్కి కల్లు తీస్తుండగా హఠాత్తుగా ప్రాణాలు కోల్పోయిన విషాద ఘటన చింతపల్లి మండలం వింజమూరులో చోటు చేసుకుంది. యాచారం దవలయ్య అనే గీత కార్మికుడు తాటి చెట్టు పైనే ప్రాణాలు కోల్పోవడంతో తోటి గీత కార్మికులు అతి కష్టం మీద చెట్టు పై నుంచి దవలయ్యను కిందికి దించారు. అప్పటికే ఆయన మృతి చెంది ఉండటంతో కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. logo