శనివారం 04 ఏప్రిల్ 2020
Telangana - Mar 06, 2020 , 09:08:49

పాలిసెట్‌ దరఖాస్తుకు చివరితేదీ ఏప్రిల్‌ 4

పాలిసెట్‌ దరఖాస్తుకు చివరితేదీ ఏప్రిల్‌ 4

హైదరాబాద్ : ప్రొఫెసర్‌ జయశంకర్‌ వర్సిటీలో వివిధ వ్యవసాయ, వ్యవసాయ ఇంజినీరింగ్‌ డిప్లొమా కోర్సుల్లో అడ్మిషన్ల కోసం నిర్వహించే పాలిసెట్‌-2020 ప్రవేశ పరీక్షకు ఆన్‌లైన్‌లో దరఖాస్తుకు ఏప్రిల్‌ 4 చివరితేదీ అని రిజిస్ట్రార్‌ డాక్టర్‌ సుధీర్‌కుమార్‌ తెలిపారు. ఇందుకు స్టేట్‌ బోర్డ్‌ ఆఫ్‌ టెక్నికల్‌ ఎడ్యుకేషన్‌, ట్రైనింగ్‌ పాలిసెట్‌ నోటిఫికేషన్‌ను ఈ నెల 2న విడుదల చేసిందని వివరించారు. వర్సిటీ పరిధిలోని ప్రభుత్వ, ప్రైవేట్‌ పాలిటెక్నిక్‌ కాలేజీల్లో అందిస్తున్న మూడేండ్ల వ్యవసాయ ఇంజినీరింగ్‌ డిప్లొమా, రెండేండ్ల వ్యవసాయ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలను పాలిసెట్‌ ర్యాంకుల ఆధారంగా చేపడుతామన్నారు పాలిసెట్‌ ఫలితాల అనంతరం ప్రవేశాలు కల్పించేందుకు వర్సిటీ విడిగా ప్రకటన విడుదలచేస్తుందన్నారు. పాలిసెట్‌లో ర్యాంకు పొందిన అభ్యర్థులు నోటిఫికేషన్‌ ఆధారంగా ప్రవేశాల కోసం విధిగా దరఖాస్తులు చేసుకోవాలి. పాలిసెట్‌ వివరాలకు, ఆన్‌లైన్‌ దరఖాస్తులకు www.polycett.nic.in, www. sbtet.telangana.gov.in ను సంప్రదించాలని సూచించారు.


logo