బుధవారం 12 ఆగస్టు 2020
Telangana - Jul 19, 2020 , 02:12:17

రైతులు పట్టు పంచెలు కట్టే రోజులొస్తున్నాయి

రైతులు పట్టు పంచెలు కట్టే రోజులొస్తున్నాయి

  • ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు

పాపన్నపేట/మెదక్‌ రూరల్‌ : తెలంగాణలోని రైతన్న చినిగిన దోతులు.. పంచెలు కట్టుకునే రోజులు పోయి.. పట్టు పంచెలు కట్టుకునే రోజులు రానున్నాయని ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు వెల్లడించారు. శనివారం మెదక్‌ జిల్లా పాపన్నపేట మండలం మల్లంపేట, యూసుఫ్‌పేట గ్రామాల్లో ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి, ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్సీ శేరి సుభాష్‌రెడ్డితో కలిసి డంపింగ్‌ యార్డును ప్రారంభించారు. యూసుఫ్‌పేటలో డబుల్‌బెడ్రూం ఇండ్లకు భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. కరోనా కారణంగా అన్ని రాష్ర్టాల్లో ఇబ్బందులు ఎదురవుతు న్నా తెలంగాణలో మాత్రం సీఎం కేసీఆర్‌ చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలతో గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతమైందని పేర్కొన్నారు. మల్లంపేటలో డంపింగ్‌యార్డు చాలా బాగున్నదని ఎంపీపీ చందనాప్రశాంత్‌రెడ్డి, సర్పంచ్‌ బాపురెడ్డిని మంత్రి అభినందించడంతోపాటు ఫొటోలు కూడా తీసుకున్నారు. 


logo