బుధవారం 20 జనవరి 2021
Telangana - Nov 27, 2020 , 01:30:41

పాడిపరిశ్రమ మరింత ఎదగాలి

పాడిపరిశ్రమ మరింత ఎదగాలి

  • శాసన మండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి

త్రిపురారం: పాల ఉత్పత్తిలో దేశాన్ని ప్రథమ స్థానంలో నిలిపిన ఘనత శ్వేత విప్లవ పితామహుడు డాక్టర్‌ వర్గీస్‌ కురియన్‌దేనని శాసన మండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి అన్నారు. ప్రపంచ క్షీర దినోత్సవంలో భాగంగా నల్లగొండ జిల్లా త్రిపురారం మండలంలోని బాబుసాయిపేటలో రైతులకు స్వయంక్షీర్‌ ప్రొడ్యూజర్‌ కోఆపరేటివ్‌ కంపెనీ నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. దేశంలో ఎక్కడా లేని విధంగా లీటర్‌కు రూ.4ల ప్రోత్సాహకాన్ని తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్నదన్నారు. రాష్ట్రంలో పాడిపరిశ్రమ మరింత అభివృద్ధి చెందాలన్నారు. హైదరాబాద్‌ నగరంలో 20 లక్షల లీటర్ల పాలు ప్రతిరోజూ అవసరమవుతుండగా, రాష్ట్రంలో కేవలం 10 లక్షల లీటర్ల పాలు మాత్రమే ఉత్పత్తి అవుతున్నాయన్నారు. రైతులు ప్రభుత్వానికి సహకరిస్తే అతి త్వరలో రాష్ట్రం కూడా ప్రథమ స్థానంలో నిలుస్తుందన్నారు. కార్యక్రమంలో నాగార్జునసాగర్‌ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య, రైతులు తదితరులు పాల్గొన్నారు. 


logo