సోమవారం 10 ఆగస్టు 2020
Telangana - Jul 23, 2020 , 13:37:13

ఖమ్మంలో సీపీఎం చిల్లర రాజకీయాలు చేస్తున్నది

ఖమ్మంలో సీపీఎం చిల్లర రాజకీయాలు చేస్తున్నది

ఖమ్మం : జిల్లాలోని మద్దులపల్లి ఘటనలో దళితులకు అన్యాయం జరిగిందనడం తప్పు అని మా ఖమ్మం జెడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజ్ అన్నారు. ఖమ్మంలోని టీఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో కమల్ రాజ్, టీఆర్ఎస్ నాయకులతో కలిసి ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. టీఆర్ఎస్  పాలనలోనే దళితులకు గతంలో ఎన్నడూ లేనంత మేలు జరుగుతుందన్నారు.  కరోనా తీవ్రంగా ఉన్న వేళ ప్రొటోకాల్ గురించి రాద్ధాంతం చేయడం అర్ధరహితమన్నారు. మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ చేస్తున్న అభివృద్ధి చూసి ఓర్వలేకనే సీపీఎం తప్పుడు విమర్శలు చేస్తున్నదని మండిపడ్డారు.

అక్రమ వెంచర్లు వేసే వారు ఈ విషయంలో జోక్యం చేసుకోవడం ఆశ్చర్యంగా వుందని ఎద్దేవా చేశారు. మంత్రి అజయ్ మీద అభాండాలు వేయడం అంటే బడుగులను అవమానించడమే. మద్దులపల్లి సభలో అన్ని సందర్భాల్లో సర్పంచ్ కు గౌరవమే దక్కిందన్నారు. ఇప్పటికైనా చౌకబారు విమర్శలు మాని అభివృద్ధిలో కలిసి రావాలని హితవు పలికారు. అలాగే మంత్రిపై తప్పుడు ప్రచారం చేస్తే సహించే ప్రసక్తే లేదని హెచ్చరించారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ జిల్లా ఇంచార్జ్ ఆర్జేసీ కృష్ణ,రాష్ట్ర కార్యదర్శి తాతా మధు, సుడా చైర్మన్ బచ్చు విజయ్, మేయర్ పాపాలాల్, ఉద్యమకారుడు బొమ్మెర రామ్మూర్తి తదితరులు పాల్గొన్నారు.


logo