శుక్రవారం 29 మే 2020
Telangana - Jan 05, 2020 ,

గ్రీన్ ఇండియా చాలెంజ్ తో దేశమంతా గ్రీనరీగా మారాలి..

గ్రీన్ ఇండియా చాలెంజ్ తో దేశమంతా గ్రీనరీగా మారాలి..

హైదరాబాద్: గ్రీన్ ఇండియా చాలెంజ్ తో దేశమంతా గ్రీనరీగా మరాలని టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి చాడ కిషన్ రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. రాజ్యసభ సభ్యులు, టీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి జోగినపల్లి సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా చాలెంజ్ విజయవంతంగా కొనసాగుతున్న విషయం తెలిసిందే. కాగా, గ్రీన్ ఇండియా చాలెంజ్ లో భాగంగా ఎడవెల్లి క్రిష్ణారెడ్డి(టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి, వరంగల్ జిల్లా) విసిరిన గ్రీన్ ఛాలెంజ్ ను టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి చాడ కిషన్ రెడ్డి స్వీకరించి, తన వ్యవసాయ క్షేత్రంలో మామిడి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎంపీ సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఛాలెంజ్ నేడు ఉద్యమంలా దిగ్విజయంగా కొనసాగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమం దేశవ్యాప్తంగా నిర్వహించడం సంతోషించదగ్గ విషయం అని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఇప్పటి వరకు దాదాపు 4 కోట్ల మొక్కలు నాటారని ఆయన తెలిపారు. 

అంతరించి పోతున్న పర్యావరణాన్ని రక్షించడం అందరి బాధ్యతగా స్వీకరించి, ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆయన మరో ముగ్గురికి గ్రీన్ ఇండియా ఛాలెంజ్ విసిరి, మొక్కలు నాటమని విజ్ఞప్తి చేశారు. వారిలో బండా నరేందర్ రెడ్డి(జడ్పీ ఛైర్మన్, నల్గొండ), ఎల్గనమోని అంజయ్య యాదవ్(ఎమ్మెల్యే, షాద్ నగర్), ఎన్. జగదీశ్వర్ రెడ్డి(ఆర్డీవో, నల్గొండ) ఉన్నారు.
logo