మంగళవారం 01 డిసెంబర్ 2020
Telangana - Nov 05, 2020 , 21:56:56

దేశం అబ్బురప‌డేలా నూత‌న సెక్ర‌టేరియ‌ట్ : వేముల ప్ర‌శాంత్‌రెడ్డి

దేశం అబ్బురప‌డేలా నూత‌న సెక్ర‌టేరియ‌ట్ : వేముల ప్ర‌శాంత్‌రెడ్డి

హైద‌రాబాద్ : సీఎం కేసీఆర్ ఆలోచనలకు అనుగుణంగా, దేశం అబ్బురపడేలా, తెలంగాణ ఖ్యాతిని చాటేలా నూతన సెక్రటేరియట్ నిర్మాణం చేప‌ట్ట‌నున్న‌ట్లు రాష్ర్ట రోడ్లు-భ‌వ‌నాలు, గృహ నిర్మాణ‌శాఖ మంత్రి వేముల ప్ర‌శాంత్‌రెడ్డి తెలిపారు. నూతన సచివాలయ నిర్మాణ పనులపై న‌గ‌రంలోని ఎర్రమంజిల్‌లో గ‌ల ఆర్ అండ్ బీ కార్యాలయంలో గురువారం సంబంధితశాఖ అధికారులు, వర్క్ ఏజెన్సీతో మంత్రి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సంద‌ర్భంగా మంత్రి మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ఏడాది కాలంలో సెక్రటేరియట్ బిల్డింగ్ పనులు పూర్తి కావాల‌న్నారు. మొత్తం బిల్డింగ్ ను ఆరు ప్రాజెక్ట్ లుగా విభజించాలని చెప్పారు. ఒక్కో ప్రాజెక్ట్ భాగానికి ఒక్కో వర్కింగ్ టీం అంటే మొత్తం ఆరు వర్కింగ్ టీమ్ లను ఏర్పాటు చేయాల‌న్నారు. 

విభాగాల‌ వారీగా 12 మంది జేఈల‌ను, ముగ్గురు డీఈల‌ను, ఒక ఈఈ, ఒక ఎస్ఈని ప్రత్యేకంగా నియమించుకోవాలన్నారు. వీరికి అదనంగా ఎలక్ట్రికల్, మెకానికల్ పనుల కోసం ముగ్గురు జేఈల‌ను, ఇద్దరు డీఈల‌ను ఒక్క ఈఈను నియమించాల‌న్నారు. షాపూర్ జి సంస్థ నుండి కూడా 12 మంది ఫీల్డ్ ఇంజనీర్లను, ఆరుగురు ప్రాజెక్ట్ ఇంజనీర్లను, ఒక్క ప్రాజెక్ట్ మేనేజర్‌ని నియమించుకోవాల‌న్నారు. ఆర్కిటెక్ట్ వైపు నుండి ఆరుగురు సూపర్‌వైజింగ్ టీంల‌ను సైట్‌లో నియమించాల‌న్నారు. డిపార్ట్‌మెంట్ ఎస్ఈ, ఆర్కిటెక్ట్, షాపూర్ జి సంస్థల నుండి ముగ్గురు కలిసి ప్రాజెక్ట్‌ను నెల వారిగా ఏ ఏ పనులు పూర్తి చేయాలో 11 నెలలను టార్గెట్‌గా పెట్టుకుని వెంట‌నే ప్ర‌ణాళిక‌ల‌ను తయారు చేయ్యాలన్నారు. పనులను నాణ్యతతో చేయటానికి ప్రపంచంలోని ఉత్తమమైన టెక్నాలజీని వాడాల‌ని సూచించారు. ప్ర‌తీవారం తానే స్వ‌యంగా సైట్‌కి వ‌చ్చి ప‌నుల‌ను ప‌ర్య‌వేక్షించ‌నున్న‌ట్లు తెలిపారు. ఈ సమీక్షా సమావేశంలో ఆర్ అండ్ బీ శాఖ ఈఎన్‌సీ గణపతి రెడ్డి, ఎస్.ఈ సత్యనారాయణ, ఈ.ఈ శశిధర్,వర్క్ ఏజెన్సీ ప్రతినిధులు, వాస్తు నిపుణులు సుధాకర్ తేజ తదితరులు పాల్గొన్నారు.