మంగళవారం 11 ఆగస్టు 2020
Telangana - Jul 10, 2020 , 18:17:43

కరోనా నుంచి కోలుకున్న ప్రభుత్వ విప్ గొంగిడి సునిత దంపతులు

కరోనా నుంచి కోలుకున్న ప్రభుత్వ విప్ గొంగిడి సునిత దంపతులు

యాదాద్రి భువనగిరి : ఇటీవల కరోనా బారిన పడిన ప్రభుత్వ విప్ గొంగిడి సునిత, టెస్కాబ్ వైస్ చైర్మన్ గొంగిడి మహేందర్రెడ్డి దంపతులు కోలుకొని శుక్రవారం దవాఖాన నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ‘మీ దీవెనలతో కరోనాను జయించాం. ఆలేరు ప్రజలకు రుణపడి ఉంటాం’ అని అన్నారు. కరోనా విజృంభిస్తున్న సమయంలో ప్రజలకు అవగాహన కల్పించాలన్న లక్ష్యంతో కొవిడ్ నిబంధనలు పాటిస్తూ నిత్యం ప్రజలతో గడుపుతూ తమ వంతు సహకారంగా నిత్యావసరాలు, మాస్కులు పంపిణీ చేశామన్నారు.

ఈ క్రమంలోనే కరోనా బారినపడ్డామని తెలిపారు. యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహుని ఆశీస్సులు, ఆలేరు నియోజకవర్గ ప్రజాప్రతినిధులు,  ప్రజల దీవెనలతో కరోనాను జయించామన్నారు. అందరూ మాస్కులు ధరించి భౌతిక దూరం పాటించామన్నారు.


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo