సోమవారం 28 సెప్టెంబర్ 2020
Telangana - Sep 09, 2020 , 12:39:23

అన్యాయాల్ని ఎదురించిన ధిక్కార స్వరం కాళోజీ

అన్యాయాల్ని ఎదురించిన ధిక్కార స్వరం కాళోజీ

వరంగల్ అర్బన్ : ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతానికి జరిగిన దోపిడీ, తెలంగాణ మాండలిక భాష ,సంస్కృతి పట్ల జరిగిన అన్యాయంపై ధిక్కార స్వరాన్ని వినిపించిన గొప్ప కవి కాళోజీ అని పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు కొనియాడారు. కాళోజీ జయంతి సందర్భంగా హన్మకొండ అదాలత్ కాళోజీ సెంటర్ వద్ద ప్రజాకవి విగ్రహానికి రాజ్యసభ సభ్యుడు బండ ప్రకాష్, గ్రేటర్ వరంగల్ మున్సిపాలిటీ మేయర్ గుండా ప్రకాష్ రావు, వరంగల్ అర్బన్ జిల్లా పరిషత్ చైర్మన్ డాక్టర్ సుధీర్ కుమార్, వరంగల్ అర్బన్, రూరల్ జిల్లాల కలెక్టర్లు రాజీవ్ గాంధీ హన్మంతు, హరిత, మున్సిపల్ కమిషనర్ పమేలా సత్పతి, కాళోజీ అవార్డ్ గ్రహీత రామా చంద్రమౌళి, కూడా చైర్మన్ మర్రి యాదవరెడ్డి నివాళులు అర్పించారు.

ఈ సందర్బంగా ఎంపీ బండ ప్రకాష్ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం అవిర్భావం తర్వాత కవులు, కళాకారులకు, సాహితీ వేత్తలకు గుర్తింపు లభించిందన్నారు. సీఎం కేసీఆర్ కాళోజీకి సముచిత గౌరవం కల్పిస్తూ వరంగల్ లో కాళోజీ మెడికల్ కళాశాల, కళా క్షేత్రం ఏర్పాటు చేశారన్నారు. ఏటా ఆ మహాకవి పేరుతో అవార్డ్ ఇస్తూ జయంతి, వర్ధంతి వేడుకలను అధికారికంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తుందన్నారు. 
logo