గురువారం 09 జూలై 2020
Telangana - Jun 19, 2020 , 11:58:00

పంజగుట్ట స్టీల్ బ్రిడ్జి నిర్మాణం అద్భుతం : మంత్రులు

పంజగుట్ట స్టీల్ బ్రిడ్జి నిర్మాణం అద్భుతం : మంత్రులు

హైదరాబాద్ : దేశంలో ఎక్కడాలేని విధంగా మంత్రి కేటీఆర్ ఆదేశాలతో హైదరాబాద్ లో స్టీల్ బ్రిడ్జి నిర్మాణం చేపట్టినట్లు మంత్రులు మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. పంజగుట్టలో స్టీల్ బ్రిడ్జిని మంత్రులు, మేయర్ బొంతు రామ్మోహన్ తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ట్రాఫిక్ ఇబ్బందులు తొలగించడానికి ఈ వంతెన దోహదపడుతుందన్నారు. ట్రాఫిక్ ఇబ్బందులను అధిగమించేందుకు జీహెచ్ఎంసీ ప్రణాళికలు అద్భుతంగా ఉన్నాయని,  వర్షాకాలంలో నగర ప్రజలు ఇబ్బందులు పడకుండా.. లాక్ డౌన్ సమయంలో జీహెచ్ఎంసీ డ్రైనేసీ, సివరేజ్ పనులు పూర్తి చేసిందని ప్రశంసించారు.


 హైదరాబాద్ నగరంపై మంత్రి కేటీఆర్ ప్రత్యేక దృష్టి పెట్టారని పేర్కొన్నారు. హైదరాబాద్ లో పెట్టుబడులు పెట్టేందుకు ప్రపంచ దేశాలు ఆసక్తి చూపుతున్నాయని వారు తెలిపారు. తక్కవ సమయంలోనే  బ్రిడ్జిని నిర్మించిన సిబ్బందికి అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే దానం నాగేందర్, జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేష్ కుమార్, సీపీ అంజనీ కుమార్, తదితరులు పాల్గొన్నారు.


logo