సోమవారం 10 ఆగస్టు 2020
Telangana - Jul 30, 2020 , 14:18:16

రైతు వేదికల నిర్మాణం విప్లవాత్మకమైన చర్య

రైతు వేదికల నిర్మాణం విప్లవాత్మకమైన చర్య

వరంగల్ రూరల్ : రైతు వేదికల నిర్మాణంతో రాష్ట్రంలో సాగులో సరికొత్త విప్లవానికి నాంది పలికినట్లయిందని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. జిల్లాలోని సంగెం మండలం గవిచర్ల, తీగరాజుపల్లి, గీసుగొండ మండలం శాయంపేట, విశ్వనాదపురం గ్రామాల్లో రైతు వేదికల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతుల సంక్షేమమే లక్ష్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్ కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. రైతు వేదికల ద్వారా అన్నదాతలు వారి సమస్యలు పరిష్కరించుకునే అవకాశం ఉంటుందన్నారు. రైతులు వ్యవసాయ అధికారుల సూచనలు పాటించి అధిక దిగుబడులు సాధించాలన్నారు. కార్యక్రమంలో పాల్గొన్న స్థానిక ప్రజాప్రతినిధులు, వ్యవసాయ శాఖ అధికారులు పాల్గొన్నారు.logo