బుధవారం 23 సెప్టెంబర్ 2020
Telangana - Aug 26, 2020 , 14:32:21

దోచుకొని, దాచుకోవడమే కాంగ్రెస్ నైజం : మంత్రి తలసాని

దోచుకొని, దాచుకోవడమే కాంగ్రెస్ నైజం : మంత్రి తలసాని

నల్లగొండ : కాంగ్రెస్ నేతలకు ఏనాడు సంక్షేమం పట్టలేదని, ప్రజల్ని దోచుకొని, దాచుకోవడమే లక్ష్యంగా పని చేశారని పశుసంవర్ధక శాఖ  మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. కేసీఆర్ నేతృత్వంలోనే సమస్త వృత్తులకు గుర్తింపు లభించిందన్నారు. అన్ని వృతులకు సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిన ఘనత కూడా తెలంగాణ సర్కార్ దే అన్నారు. మత్స్యకారుల జీవితాల్లో చేప పిల్లల పంపిణీ సమూల మార్పులు తీసుకువస్తుందని చెప్పారు.

జిల్లాలోని నాగార్జున సాగర్ నియోజకవర్గంలో పర్యటిoచిన ఆయన అనుముల మండలం కొత్తపల్లి గ్రామంలో స్థానిక ఎమ్మెల్యే నోముల నర్సింహ్మయ్యతో కలిసి పల్లె ప్రకృతి వనాన్ని ప్రారంభించి మొక్కలు నాటారు. అనంతరం తిరుమలగిరిసాగర్ మండల కేంద్రంలోని పెద్ద చెరువులో చేప పిల్లలను వదిలారు.

అధికారంలో ఉన్నపుడు ఏనాడు  కాంగ్రెస్ నాయకులకు రైతులు గుర్తుకు రాలేదని తలసాని దుయ్యబట్టారు. రైతుబంధు, రైతుబీమా, 24 గంటల ఉచిత  కరంట్, పుష్కలంగా నీళ్లు ఇస్తున్న ఏకైక  రాష్ట్రం తెలంగాణ అని మంత్రి పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఫ్లోరైడ్ భూతాన్ని తరిమికొడుతూ ఇంటింటికి సురక్షిత నది జలాలను అందుస్తున్నారని తెలిపారు. 


logo