గురువారం 16 జూలై 2020
Telangana - Jun 05, 2020 , 13:17:35

టీఆర్ఎస్ లో చేరిన కాంగ్రెస్ నేతలు

టీఆర్ఎస్ లో చేరిన కాంగ్రెస్ నేతలు

కామారెడ్డి : టీఆర్ఎస్ లో చేరికల పర్వం పెద్ద ఎత్తున కొనసాగుతున్నది. తాజాగా కామారెడ్డి జిల్లా బాన్సువాడ నియోజకవర్గ పరిధిలోని నిజామాబాద్ జిల్లా వర్ని మండలానికి చెందిన కాంగ్రెస్ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సమక్షంలో టీఆర్ఎస్ లో చేరారు. బాన్సువాడ పట్టణంలోని టీఆర్ఎస్  నియోజకవర్గ  కార్యాలయంలో వారికి మంత్రి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సీఎం కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రం ప్రగతి పథంలో దూసుకెళ్తుందన్నారు. టీఆర్ఎస్ పాలనలోనే తెలంగాణ సుభిక్షంగా ఉంటుందని పార్టీలో చేరినట్లు తెలిపారు. పార్టీలో చేరిన వారిలో వర్నిమండల కాంగ్రెస్ అధ్యక్షుడు, తగిలేపల్లి ఎంపీటీసీ బక్క నారాయణ, ముదిరాజ్ సంఘం మండలం అధ్యక్షుడు, జాకోరా ఎంపీటీసీ ఎండుగుల సాయిలు, 500 మంది కార్యకర్తలు టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు.


logo