బుధవారం 27 మే 2020
Telangana - May 18, 2020 , 18:10:25

కేంద్ర ప్రభుత్వం తీరు ఫెడరల్‌ స్ఫూర్తికి విరుద్ధం

కేంద్ర ప్రభుత్వం తీరు ఫెడరల్‌ స్ఫూర్తికి విరుద్ధం

హైదరాబాద్‌ : కేంద్ర ప్రభుత్వం బరితెగించి బొగ్గు గనులను ప్రైవేట్‌ పరం చేయాలని చూస్తున్నదని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. అదే జరిగితే తెంగాణకు గుండెకాయ అయినటువంటి సింగరేణి నష్టం వాటిల్లే ప్రమాదం ఉందన్నారు. అలాగే విద్యుత్‌ సంస్థలను కూడా కేంద్రం గుప్పిట్లో ఉంచుకునే ప్రయత్నం చేస్తుందన్నారు. ఇలాంటి చర్యలు ఫెడరల్‌ స్ఫూర్తికి విరుద్ధమని కేంద్రం తీరుపై ఆయన మండిపడ్డారు. అందరం కలిసికట్టుగా మోదీ ప్రభుత్వం ఎకపక్షంగా తీసుకుంటున్న చర్యలను ఎండగట్టాలని పిలుపునిచ్చారు.


logo