బుధవారం 05 ఆగస్టు 2020
Telangana - Jul 05, 2020 , 16:50:15

విదేశాల్లోనూ మంత్రి ఎర్రబెల్లి పుట్టిన రోజు వేడుకలు

విదేశాల్లోనూ మంత్రి ఎర్రబెల్లి పుట్టిన రోజు వేడుకలు

అమెరికా : పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుకి దేశ విదేశాల్లోనూ అభిమానులు ఉన్నారు. ఆయన ఎక్కడకు వెళ్ళినా అది స్పష్టమవుతూనే ఉంటుంది. ఆయన జన్మదిన వేడుకలు ఇదే విషయాన్ని మరోసారి రుజువు చేశాయి. జూలై 4వ తేదీన మంత్రి ఎర్రబెల్లి పుట్టిన రోజు. కరోనా నేపథ్యంలో ఆయన వేడుకలకు దూరంగా ఉన్నారు. పార్టీ శ్రేణులు, ఆయన అభిమానులకు కూడా ఇలాగే పిలుపు నిచ్చారు. తన పుట్టిన రోజున మొక్కలు నాటాలని సూచించారు. దీంతో ఆయన అభిమానులు ఒక్క తన పాలకుర్తి నియోజకవర్గంలోనే, లక్ష మొక్కలు నాటారు.

ఇదే వరుసలో ఆయన అభిమానులు అమెరికా లోనూ మంత్రి ఎర్రబెల్లి పుట్టిన రోజు వేడుకలు జరిపారు. అమెరికా లోని మిడ్ వెస్ట్ ఇంచార్జి అల్లంనేని నిరంజన్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి వేడుకలు నిర్వహించారు. కార్యక్రమంలో డా. కిరణ్ లింగాల, డా. నవీన్ కుమార్ అనంతా, సుమన్ రెడ్డి వడ్డి, వాణి ప్రసాద్ ల కుటుంబసభ్యులు పాల్గొన్నారు. విషయం తెలిసిన మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అమెరికాలో తన పుట్టిన రోజు వేడుకలు నిర్వహించిన తన అభిమానులకు కృతజ్ఞతలు తెలిపారు.


logo