పోలింగ్‌కు పోదాం

- నగర ఓటర్లకు సినీ ప్రముఖుల పిలుపు
హైదరాబాద్, నమస్తే తెలంగాణ: జీహెచ్ఎంసీలో మంగళవారం జరుగనున్న ఎన్నికల్లో ప్రతి ఒక్కరు ఓటు హక్కును వినియోగించుకోవాలని సినీ ప్రముఖులు పిలుపునిచ్చారు. ప్రభుత్వం కల్పించిన సెలవును ఇతర పనులకు కాకుండా ఓటేసేందుకు వినియోగించాలని కోరారు. హైదరాబాద్ భవిష్యత్‌కు ఏ పార్టీ అయితే సరైనదో అంచనాకు వచ్చి.. ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు.
ఓటు మరువొద్దు
గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో మనందరం ఓటు హక్కును వినియోగించుకుందాం. హైదరాబాద్ అభివృద్ధిని, శాంతిని కాపాడుకుందాం. ఎన్నికల సంఘం కూడా కరోనా వ్యాపించకుండా అనేక జాగ్రత్తలు తీసుకున్నది. తప్పనిసరిగా ఓటేసి ప్రజాస్వామ్యాన్ని కాపాడుదాం.
- శంకర్, సినీ డైరెక్టర్
ఓటరే కదా బాహుబలి
గ్రేటర్ హైదరాబాద్‌లో ఓటరే కదా బాహుబలి.. డబ్బులకో, తాగుడుకో లోబడి చేసుకోకు నీ బతుకు బలి.. అభ్యర్థులు ఎలాంటి వారో.. గత చరిత్ర ఏమిటో.. ప్రజాసేవపై ఉన్న నిజమైన ప్రేమ ఎంతో కచ్చితంగా నువ్వు నిర్ణయించి ఓటేయాలి.. నచ్చకుంటే బ్యాలెట్లో నోటా ఉంటుంది చూడు ఓటింగ్ డే అంటే ఎప్పుడూ హాలిడే కాదు ఓటుహక్కు రాజ్యాంగం మనకు ఇచ్చిన గొప్పవరం చేసుకోకు చేజేతులా బతుకు ఐదేండ్ల వరకు శాపం.
- సుద్దాల అశోక్‌తేజ, ప్రముఖ సినీ రచయిత
తప్పకుండా ఓటేయండి
మంగళవారం గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలున్నాయి. సిటీలో ఉన్న ప్రతి ఒక్కరు తప్పకుండా మీ ఓటు వేయండి. అధికారులు పోలింగ్ బూత్‌ల దగ్గర అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మీరు మాస్క్ పెట్టుకొని, సోషల్ డిస్టెన్స్ పాటించి ఓటేయండి. మన హైదరాబాద్, మన రాష్ట్ర శాంతి, సౌభాగ్యం కోసం ఓటు వేయండి
- విజయ్ దేవరకొండ, సినీ నటుడు
ఓటు మన ఆత్మగౌరవంఓటు మన హక్కు, మన బాధ్యత
ఓటు మన ఉనికి, మన ఆత్మగౌరవం, అస్తిత్వం ఓటు రాజ్యాంగం మనకు ఇచ్చిన ఆయుధం సక్రమంగా వాడుదాం.. సద్వినియోగం చేసుకుందాం.
- సుమ, యాంకర్
మంచి పాలన అవసరం
మన హైదరాబాద్, అప్నా హైదరాబాద్. నిజంగా మనం నగరాన్ని ప్రేమిస్తే తప్పకుండా ఓటు వేయాలి. నగరానికి మంచి పాలన అవసరం. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో అందరం ఓటుహక్కు వినియోగించుకుందాం.
- శేఖర్ కమ్ముల, సినీ డైరెక్టర్
అభివృద్ధి కోసం ఓటేద్దాం
గాలి, నీరు, నేల, నిప్పు, ఆకాశం ఇవి ప్రకృతి మనకు ఇచ్చిన ఎలిమెంట్స్ రాజ్యాంగం ఇచ్చిన ఆరో ఎలిమెంట్ ఓటు రండి ఓటు హక్కును వినియోగించుకుందాం. ప్రజాస్వామ్యాన్ని గెలిపిద్దాం. హైదరాబాద్ అభివృద్ధి కోసం మనందరం ఓటు వేయడం ఎంతో ముఖ్యం.
- ఝాన్సీ, యాంకర్
ఓటు హక్కు వినియోగించుకుందాం
ఈ నగరంలో జీవిస్తున్నందుకు నేను ఎంత అదృష్టవంతుడినో నాకు బాగా తెలుసు. హైదరాబాద్ విశ్వనగరంగా, మోస్ట్ లివబుల్ సిటీగా ప్రపంచవ్యాప్తంగా పేరు తెచ్చుకుంటుంది. ఇంత గొప్ప నగరంలో మంగళవారం ఎన్నికలు జరుగుతున్నాయి. రాజ్యాంగం కల్పించిన హక్కును ప్రతి ఒక్కరం వినియోగించుకుందాం. మనందరం ఓటువేసి ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేద్దాం.
- ప్రియదర్శి, సినీనటుడు
తాజావార్తలు
- ఆప్ ఎంపీ సంజయ్‌సింగ్‌కు బెదిరింపులు
- ఆవిష్కరణల హైదరాబాద్.. సౌరవిద్యుత్‌లో బాగుబాగు
- రన్ వే పై చిరుత రయ్.. రయ్...! వీడియో వైరల్... !
- విద్వేషాలు రెచ్చగొట్టడమే బీజేపీ ఎజెండా : ఎమ్మెల్యే జీవన్ రెడ్డి
- మరో 5జీ ఫోన్ లాంచ్ చేసిన ఒప్పో..ప్రీ-బుకింగ్స్ ప్రారంభం
- వెడ్డింగ్ ఫొటోలు షేర్ చేసిన కాజల్
- సహారా ఎడారిలో ఈ వింత చూశారా?
- బూర్గుల మృతి పట్ల వినోద్ కుమార్ సంతాపం
- గూగుల్ కస్టమర్లకు గుడ్ న్యూస్..!
- బర్డ్ ఫ్లూ నిజంగా ప్రమాదమేనా...?