బుధవారం 08 ఏప్రిల్ 2020
Telangana - Mar 09, 2020 , 01:28:10

శాంతిభద్రతలు మరింత పక్కాగా

శాంతిభద్రతలు మరింత పక్కాగా
  • పోలీస్‌శాఖకు రూ.5,851.96 కోట్లు
  • గతంకంటే రూ.862 కోట్లు అదనం

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: రాష్ట్రంలో శాంతిభద్రతల పరిక్షణకు అధిక ప్రాధాన్యమిస్తూ, పోలీస్‌శాఖ బలోపేతానికి ఊతమిచ్చేలా బడ్జెట్‌లో కేటాయింపులను పెంచారు. గతేడాది బడ్జెట్‌తో పోలిస్తే పోలీస్‌శాఖకు ఈ బడ్జెట్‌లో రూ.862.29 కోట్ల నిధులు పెరిగాయి. గత బడ్జెట్‌లో రూ.4,989.67 కోట్లు కేటాయించగా, ఈ ఏడాది వార్షిక బడ్జెట్‌లో రూ.5,851.96 కోట్లకు పెరిగాయి. ఇందులో నిర్వహణ పద్దు కింద రూ.5,179.22 కోట్లు, ప్రగతిపద్దు కింద రూ.672.74 కోట్లు ఇచ్చారు. గత బడ్జెట్‌లో కేటాయింపుల్లోనూ శాంతిభద్రతల పరిరక్షణకు ప్రభుత్వం అ్యతధిక ప్రాధాన్యమిచ్చింది. పోలీస్‌శాఖ ఆధునీకరణ, శిక్షణ, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం కోసం, వాహనాల కొనుగోలుకు ప్రభుత్వం పెద్దఎత్తున నిధులు ఖర్చుచేసింది. శాంతిభద్రతల నిర్వహణ మరింత సమర్థంగా ఉండేందుకు అంతర్జాతీయస్థాయిలో హైదరాబాద్‌లో నిర్మిస్తున్న కమాండ్‌ అండ్‌ కంట్రోల్‌ సెంటర్‌కు ఈ ఏడాది బడ్జెట్‌ కేటాయింపుల్లో ప్రాధాన్యం ఇచ్చారు. 


logo