గురువారం 02 ఏప్రిల్ 2020
Telangana - Mar 09, 2020 , 02:11:17

జనరంజక బడ్జెట్‌

 జనరంజక బడ్జెట్‌

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: రాష్ట్ర వార్షిక బడ్జెట్‌లో విద్యాశాఖకు భారీగా నిధులు పెంచారు. బడ్జెట్‌లో పాఠశాల, ఉన్నత, సాంకేతిక విద్యాశాఖలకు కలిపి రూ.12,144.27 కోట్లు ప్రతిపాదించారు. గత బడ్జెట్‌లో విద్యాశాఖకు 9,899.79 కోట్లు కేటాయించారు. ఈసారి అదనంగా 2,244.96 కోట్లు పెంచారు. రాష్ట్రీయ ఉచ్చతర్‌ శిక్ష అభియాన్‌ రూసా పథకానికి రూ.14.73 కోట్లు ప్రతిపాదించారు. పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకానికి రూ.365.55 కోట్లు కేటాయించారు. వారంలో మూడ్రోజులు విద్యార్థులకు కోడిగుడ్ల కోసం రూ.63.63 కోట్లు ప్రతిపాదించారు. తెలంగాణ గురుకుల విద్యాలయాల కు రూ.135.99 కోట్లు, సమగ్రశిక్ష అభియాన్‌ పథకానికి రూ.623.48 కోట్లు కేటాయించారు. ఇందులో రా ష్ట్రీయ మాధ్యమిక శిక్షఅభియాన్‌ కిం ద రూ.300 కోట్లు ప్రతిపాదించారు.
logo
>>>>>>