గురువారం 02 ఏప్రిల్ 2020
Telangana - Mar 16, 2020 , 21:05:51

వాగులో పడి బాలుడి మృతి

వాగులో పడి బాలుడి మృతి

గరిడేపల్లి : వాగు వద్ద బట్టలు ఉతికేందుకు తల్లితో కలిసి వెళ్లిన బాలుడు ప్రమాదశాత్తు అందులో పడి మృతి చెందిన ఘటన సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండలం సర్వారంలో జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన సైదాహుస్సేన్‌, సైదాబీ దంపతుల చిన్న కుమారుడైన హనీఫ్‌ (11) నల్లగొండ జిల్లా అనుముల మైనార్టీ రెసిడెన్షియల్‌ స్కూల్‌లో ఐదో తరగతి చదువుతున్నాడు. క్రరోనా వైరస్‌ కారణంగా పభుత్వం పాఠశాలలకు సెలవులు ఇవ్వడంతో ఆదివారమే ఇంటికి వచ్చాడు. ఈ రోజు తన తల్లి సైదాబీ బట్టలు ఉతికేందుకు గ్రామ సమీపంలోని వేములూరు వాగు బ్రిడ్జి వద్దకు వెళ్లాడు. 

 తనతో కలిసి అదే పాఠశాలలో చదువుతున్న గ్రామానికి చెందిన సాజీర్‌, మునీర్‌లను వాగు వద్దకు వెళ్లాడు. తల్లి బట్టలు ఉతుకుతుండగా స్నేహితులతో కలిసి హనీప్‌ ఈత కొట్టేందుకు వాగులో దిగగా ప్రవాహ వేగానికి ముగ్గురు నీటిలో కొట్టుకుపోయారు. బ్రిడ్జికి పక్కనే గల గూనల వద్ద సుడిగుండలో తిరుగుతుండగా స్థానికులు గమనించి కేకలు వేయడంతో పక్కనే గొర్రెలు మేపుతున్న ఓ వ్యక్తి సాజీర్‌, మునీర్‌లను బయటకు లాగాడు. హనీప్‌ సుడిగుండంలో తిరుగుతూ అడుగున్న ఉన్న రాళ్లలో ఇరుక్కుపోయాడు. విషయం తెలుసుకున్న గ్రామస్తులు అక్కడకు చేరుకుని వాగులోకి దిగి హనీప్‌ మృతదేహాన్ని బయటకు తీశారు. సెలవులకు ఇంటికి వచ్చిన కుమారుడు వాగులో పడి మృతి చెందడంతో ఆ తల్లిదండ్రులు దుఖఃసాగరంలో మునిగిపోయారు. ఈ ఘటనతో గ్రామంలో విషాదచాయలు అలుముకున్నాయి.


logo
>>>>>>