బుధవారం 27 మే 2020
Telangana - May 22, 2020 , 20:05:56

సీపీఆర్‌ విధానంతో పసి బిడ్డను బతికించారు

సీపీఆర్‌ విధానంతో పసి బిడ్డను బతికించారు

మహబూబ్‌నగర్‌: జిల్లాలోని రాజాపూర్‌ ప్రభుత్వ దవాఖానలో సిబ్బంది అరుదైన ప్రసవం చేశారు. కాన్పు సమయంలో తల్లి కడుపులోనే శిశువుకు శ్వాస ఆగిపోవడంతో కార్డియో పల్మనరీ రెసుస్కిటేషన్‌ (సీపీఆర్‌) చేసి బిడ్డకు శ్వాస అందించి బతికించారు. హైదరాబాద్‌ బహద్దూర్‌పూరకు చెందిన లలిత ప్రసవం కోసం పుట్టింటికి వచ్చింది. గురువారం రాత్రి పురిటి నొప్పులు రావడంతో 108 అంబులెన్స్‌లో ఆమెను సింగమగూడ నుంచి రాజాపూర్‌లోని ప్రభుత్వ దవాఖానకు తరలించారు. అక్కడ విధుల్లో ఉన్న స్టాఫ్‌నర్సు శోభారాణి ఆమెకు ప్రసవం చేశారు. ఈ సమయంలో తలకు బదులు ముందుగా కాళ్లు రావడంతో సిబ్బంది చాకచక్యంగా వ్యవహరించి పురుడు పోశారు. అనంతరం తల్లీబిడ్డను మెరుగైన చికిత్స కోసం నీలోఫర్‌ హాస్పిటల్‌కు పంపించారు.


logo