మంగళవారం 11 ఆగస్టు 2020
Telangana - Jul 27, 2020 , 03:04:43

ఊకె కరోనా ముచ్చట్లేనా.. ఉల్లాసాన్నిచ్చే సంగతులు చెప్పండి!

ఊకె కరోనా ముచ్చట్లేనా.. ఉల్లాసాన్నిచ్చే సంగతులు చెప్పండి!

  • సామాజిక మాధ్యమాల్లో సందేశాలపై సగటు మనిషి అసహనం

హైదరాబాద్‌: సామాజిక మాధ్యమాల్లో ప్రచారం అవుతున్న కరోనా వార్తల పట్ల సగటు మనిషి తీవ్ర అసహనానికి లోనవుతున్నాడు. కరోనాపై అవగాహన కల్పించడం మంచిదే కానీ ఒకే సందేశాన్ని వందల మంది ఫార్వర్డ్‌ చేయడం విసుగు తెప్పిస్తున్నదని చాలా మంది అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికే వైద్యులు ఆందోళన పక్కన పెట్టి మానసకంగా ఉల్లాసంగా ఉండాలని చెప్తున్న నేపథ్యంలో కరోనాపై అనవసర విషయాలు ప్రచారం చేయవద్దని కోరుతూ ఓ వ్యక్తి వాట్సాప్‌ గ్రూపులో సభ్యులకు కింది విధంగా సూచనలు చేయడం వాస్తవ పరిస్థితిని తెలుపుతున్నది ‘ఊరికే కరోనా పోస్టులు పెట్టకండి. 

ఏం పని. ఎక్కడ చూసినా ఫేస్బుక్‌ చూసినా అవే. వాట్సాప్‌ చూసినా అవే. ఎప్పటికీ అవే ఫార్వర్డు మెసేజులు ఎందుకు? ఎక్కడేం పనిలేక? ఏదన్నా ధైర్యాన్నిచ్చే పోస్టులు పెట్టండి. మానసిక ఉల్లాసాన్ని ఇచ్చేవి పెట్టండి. మీ కవిత్వాలు పెట్టండి. ఇంకేమన్నా పెట్టండి. కానీ ఎప్పుడు కరోనానే ఎందుకు? కరోనా.. కరోనా.. మన్నూ మషానం. అవ్వి పెట్టకండి..  ఉన్నన్ని రోజులు ఉంటం. పీకిన్నాడు పీకుతం. ఎప్పటికి..  నిత్యం.. రోజూ ఇవి చూసుకుంటూ చచ్చుడు. అందుకే దయ చేసి పెట్టకండి. ఏం అనుకోవద్దు. మంచివి పెట్టండి ఏమన్నా. చూసి ఆనందపడేవి. ఇప్పటిదాకా ఎవరో వాటర్‌ఫాల్స్‌ పెట్టినరు. ఎంత ఆనందంగా ఉంది. చూస్తుంటెనే మనిగనిపిస్తంది. అలాంటివి పెట్టండి. ఎప్పుడూ అడ్డమైన పోస్టు తియ్యా.. ఫార్వర్డ్‌ చెయ్యా..’ అంటూ సదరు వ్యక్తి అసహనం వ్యక్తం చేయడంతో పాటు తన మిత్రులకు సూచనలు చేశాడు.


logo